మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా జూన్ 11న సీనియర్ దర్శకుడు వి. మధుసూదనరావు శతజయంతి ఉత్సవాలను నిర్వ హించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విక్టరీ మధుసూదనరావుగా ప్రసిద్దులైన ఆయన అ’కే చిత్రా లకు దర్శకత్వం వహించి తనదైన ముద్రవేశారు. శత జయంతి ఉత్సవ వివరాలను తెలిపేందుకు నిర్మాతల మండలి హాలులో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. దర్శకుడు కోదండరామిరెడ్డి, నటుడు శివాజీరాజా, శ్రీమతి వాణీదేవి (మధుసూదనరావు కుమార్తె) తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి వాణీదేవి మాట్లాడుతూ ”నాన్నగారి శతజయంతి సందర్భంగా ఆయన భావాలను కొంతవరకైనా ప్రజల్లోకి తీసుకెళితే బాగుంటుందని భావించాం. మా అమ్మ నాన్న కమ్యూనిజం భావాలుకలిగిన వ్యక్తులు. ఇద్దరూ ప్రజానాట్యమండలిలో పనిచేశారు. శతజయంతి ఉత్సవానికి అందరూ ఆహ్వానితులే ” అని అన్నారు. అతిథులందరూ మధుసూదనరావు వ్యక్తిత్వం గురించి, ఆయన క్రమశిక్షణ గురించి ప్రసంగించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement