ఓ టీ దుకాణం నిర్వహించే వ్యక్తిని సాక్షాత్త్ భారత ఉపరాష్ట్రపతి కొనియాడితే..అయినా టీ దుకాణం వ్యక్తిని ఉప రాష్ట్రపతి ఎందుకు కలుస్తారనుకుంటున్నారా..వివరాల్లోకి వెళ్తే.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజులు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. కాగా నేడు మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆంధ్రా యూనివర్సిటీ అవుట్ గేట్ వద్ద టీ దుకాణం నిర్విహించే కనకరాజు అనే వ్యక్తిని కలిశారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. టీ దుకాణం నిర్వహించే కనకరాజు ఏడేళ్లలోపు పిల్లలకు బిస్కెట్లు, పాలు ఉచితంగా అందిస్తుంటాడని, అలాంటి వ్యక్తిని కలవడం ఆనందం కలిగించిందని తెలిపారు.
భారతీయ సంప్రదాయాన్ని పాటిస్తున్న ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని వివరించారు. మన కష్టంతో సంపదను పెంచుకోవడమే కాకుండా, మనకు ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడం భారతీయ సంస్కృతిలో భాగమని తెలిపారు. కనకరాజు ఔదార్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.అనంతరం విశాఖపట్నం-కిరండోల్ మధ్య నేడు విస్టాడోమ్ రైలును ప్రారంభించారు. ఈ రైలుకు నూతన ఎల్ హెచ్ బీ సాంకేతికతో తయారైన బోగీలను, గ్లాస్ రూఫ్ తో రూపొందించిన విస్టాడోమ్ బోగీలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా విస్టాడోమ్ బోగీలో ఎక్కిన వెంకయ్యనాయుడు ప్రయాణికులతో మాట్లాడి వారి స్పందన తెలుసుకున్నారు.
గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..