సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మహమ్మారి కరోనాతో పలువురు సినీ ప్రముఖులు చనిపోయారు. తాజాగా ప్రముఖ తెలుగు సీనియర్ గాయకుడు జి.ఆనంద్ కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించింది. సకాలంలో సకాలంలో ఆక్సిజన్ అందకపోవడంతో ఆనంద్ మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.
జి. ఆనంద్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లా తులగమ్ గ్రామంలో జన్మించారు. గత ఐదు దశాబ్దాలుగా సినీ రగంలో కొనసాగుతూ స్వర మాధురి బృందం ద్వారా అమెరికాతో పాటు ప్రపంచమంతటా 6500 పైచిలుకు ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన ముఖ్యంగా ‘ఒక వేణువు వినిపిం చెను’ (అమెరికా అమ్మాయి), ‘దిక్కులు చూడకు రామయ్య.., ‘విఠలా విఠలా పాండురంగ విఠలా..’ వంటి సూపర్ హిట్ పాటలను పాడారు. అంతేకాదు ప్రాణం ఖరీదు, మనవూరి పాండవులు, మా బంగారక్క, చక్రధారి, తాయారమ్మ -బంగారయ్య తదితర చిత్రాలలో ఆయన పాటలు పాడారు. ‘గాంధీనగర్ రెండో వీధి’, ‘స్వాతంత్య్రానికి ఊపిరి పోయండి’, ‘రంగవల్లి’ చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. సీరియల్స్ కు, అనువాద చిత్రాలకు సంగీత సారథ్యం కూడా వహించారు. ఆనంద్ మృతి తోటి సింగర్స్ విషాదంలో మునిగిపోయారు. ఆనంద్ మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక కరోనా బారిన పడి మరో ప్రముఖ సింగర్ ఎస్పీ బాలు కూడా మరణించిన సంగతి తెలిసిందే.
ఈ స్టోరీ కూడా చదవండి: కరోనాతో ప్రముఖ కమెడియన్ మృతి