Sunday, November 10, 2024

టీ20వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడ‌లేక‌పోతున్నందుకు చాలా బాధ‌గా ఉంది – బుమ్రా

ఈసారి టీ20వ‌ర‌ల్డ్ క‌ప్ లో తాను ఆడ‌లేక‌పోతున్నందుకు చాలా బాధ‌గా ఉంద‌ని తెలిపాడు టీమిండియా ప్ర‌ధాన ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా. ఈ విష‌యంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో తాను ఆడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందన్నారు. ఈ సమయంలో తాను కోలుకోవాలంటూ సందేశాలు పంపిస్తూ, మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు. తాను కోలుకుంటున్నానని, టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. గత కొన్నిరోజులుగా వీపునొప్పితో బాధపడుతున్న బుమ్రాకు వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయం తీవ్రమైనదేనని వెల్లడైంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు దూరమైన బుమ్రా… గాయం తీవ్రత దృష్ట్యా టీ20 వరల్డ్ కప్ కు కూడా అందుబాటులో లేకుండాపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement