Friday, November 22, 2024

అలయ్ బలయ్.. ప్రాచీన వారసత్వం కాపాడాలి: వెంకయ్య

కులమతాలను పక్కన పెట్టి అందరూ కలిసి ముందుకు వెళ్లాలనేదే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం హైదరాబాద్ జలవిహార్‌లో జరుగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ సంస్కృతుల్లో భారతీయ సంస్కృతి విశిష్టమైందన్నారు. తెలంగాణలో బతుకమ్మ, బోనాల పండుగలు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర సంస్కృతిని తెలుపుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరు ఈ పండుగలో పాల్గొనాలని సూచించారు.

ఇది కూడా చదవండి: ఈ వారంలోనే ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement