ఏపీ అసెంబ్లీలో రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. సినిమాటోగ్రఫీ బిల్లుతో పాటు వాహన పన్నుల చట్ట సవరణ బిల్లు ఆమోదం తెలిపారు. కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్..పాత వాహనాల గ్రీన్ ట్యాక్స్ పెంచుతూ చట్ట సవరణ చేశారు. మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు రవాణాశాఖ మంత్రి పేర్నినాని. పర్యావరణాన్ని రక్షించేందుకు , అధిక కర్బనాలను విడుదల చేసే పాత వాహనాలను నివారించేందుకు ఈ చట్ట సవరణ చేసినట్లు తెలిపారు. గ్రీన్ ట్యాక్స్ పేరిట ఈ పన్నులు పెంచాలని నిర్ణయంచామన్నారు. పదేళ్లలోపు వాహనాలు, 12 ఏళ్లు మించిన వాహనాలు, రవాణా, రవాణేతర వాహనాలు, ఏడు నుంచి 10 ఏళ్లలోపు వాహనాలు 4 వేల రూపాయలు ట్యాక్స్ కట్టాలన్నారు.
12 ఏళ్లు దాటితే 6 వేల రూపాయల గ్రీన్ ట్యాక్స్ విధించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పర్యావరణ హితం కోసం గ్రీన్ ట్యాక్స్ ను అదనంగా విధించాలని నిర్ణయం తీసుకున్నామని… నూతన వాహనాల విక్రయించినప్పుడు కూడా పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. 20 లక్షల రూపాయల పైబడిన వాహనాలపై 18 శాతం వరకూ పన్ను విధించామని… అదనంగా 4 శాతం పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐదు లక్షల లోపు ఉన్న వాహనాలకు 1 శాతం మాత్రమే పన్ను పెంచుతున్నామని.. 10 లక్షలపైబడిన వాహనాలకు 3 శాతం పన్ను అదనంగా విధించాలని చట్టంలో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..