Tuesday, November 19, 2024

eX–Clusive | వర్రకుంటను మింగేశారు.. విల్లాల కోసం నీటివనరులు గాయబ్​

వర్రకుంటను మొత్తానికే మింగేశారు. విల్లాల నిర్మాణం కోసం చెరువునే లేకుండా చేశారు. కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులను కొంతమంది లీడర్లు, అధికార బీఆర్​ఎస్​ పార్టీ ప్రజాప్రతినిధులు చెరబడుతున్నారు. హైదరాబాద్​తోపాటు.. చట్టుపక్కల డెవలప్​ అవుతున్న సిటీని ఆసరాగా చేసుకుని విల్లాలు నిర్మించేందుకు ఏకంగా హెచ్​ఎండీఏ నుంచి పర్మిషన్​ కూడా తెచ్చుకున్నారు. దీనికి  గ్రేటర్​ ఇన్​ఫా పేరుతో విల్లాల నిర్మాణం కూడా జరుగుతోంది. దీంతో నిజాంపేట్​ కార్పొరేషన్​ బాచుపల్లి పరిధిలోని ఎల్లమ్మ చెరువు నుంచి బొల్లారం మున్సిపాలిటీ వర్రకుంటకు నీరు రాకుండా పోతోంది. తాగునీటి వనరులను నాశనం చేస్తూ బడా కాంట్రాక్టర్లు, కొంతమంది బీఆర్​ఎస్​ లీడర్లు ఈ దందాకు పూనుకున్నట్టు స్పష్టమవుతోంది.

ఇట్లా ఓ చెరువును లేపేసి ఆ ప్లేసులో విల్లాలు నిర్మిస్తుంటే.. దీనికి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం వెనకాల ఎవరి హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెరువులను కాపాడేలా సీఎం కేసీఆర్​ సీరియస్​గా చర్యలు తీసుకుంటుంటే.. కొంతమంది కబ్జాకోరులు ఇలా చెరువులను చెరబడుతూ భవిష్యత్​ తరాలకు నీటి వనరులు లేకుండా చేస్తున్నారు. అందులో మున్సిపల్​ శాఖ మంత్రిగా కేటీఆర్​ హయాంలో ఇదంతా జరగడాన్ని కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్​ సీరియస్​ యాక్షన్​ తీసుకుని కబ్జాకు పాల్పడ్డ పార్టీ లీడర్లపై వేటు వేయాలని, ఎంతటి వారైనా సరే.. కఠిన నిర్ణయాలు తీసకుంటేనే ఇలాంటి కబ్జాలు జరగవని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే ఇది పార్టీకి, సీఎం కేసీఆర్​కు, మంత్రి కేటీఆర్​కు మాయని మచ్చగా మిగులుతుందని, దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టకముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement