వంగవీటి రంగా 33వ వర్థంతి సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. వంగవీటి రాధా, వల్లభనేని వంశీలు కలిసి విజయవాడ బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి పూలమాల వేశారు. దీనికి ముందే రాధా కార్యాలయంలో వారు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాజకీయ, వ్యక్తిగత విషయాలు చర్చించినట్టు సమాచారం. కొన్నాళ్లుగా అడపాదడపా కొన్ని కార్యక్రమాలకు హాజరవడం తప్పితే పెద్దగా ఫ్రేమ్ లో లేని రాధా.. ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. వంగవీటి కుటుంబాన్ని ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాధా. 33 ఏళ్లుగా తన తండ్రి వర్ధంతిని అభిమానులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆశయసాధన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి వంగవీటి రంగా అని వల్లభనేని వంశీ కొనియాడారు. చనిపోయినా జనం మనసుల్లో గుర్తుండిపోయే నేతలు ముగ్గురని, వారు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వంగవీటి రంగా అని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..