Friday, November 22, 2024

ఎద్దుని ఢీ కొన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్..నెల రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన

ఓ ఎద్దుని ఢీ కొంది వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్. నెల రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన. గుజరాత్‌లోని గాంధీ నగర్, మహారాష్ట్రలోని ముంబయికి మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శనివారం ఓ ఎద్దును ఢీకొంది. గుజరాత్‌లో అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 15 నిమిషాలు నిలిచిపోయింది. ఎద్దును ఢీకొన్న కారణంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముందు భాగం ధ్వంసమైంది. డ్రైవర్ కోచ్‌కు చెందిన ముందు కప్పు విరిగిపోయింది. కొత్తగా సేవల్లోకి వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇటీవలే రెండు సార్లు పశువులను ఢీకొంది. తొలిసారి నాలుగు గేదెలను ఢీకొంది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఓ గోవును ఢీకొట్టింది. గుజరాత్‌లో ఆనంద్ స్టేషన్ సమీపంలో గోవును ఢీకొట్టింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ ఇలాంటి ఘటనలపై గతంలోనే స్పందించారు. పశువులను ఢీకొనే ఘటనలను నివారించలేమని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement