Tuesday, November 26, 2024

వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ సీ-3, సీ-6 కోచ్‌లపై రాళ్ల దాడి.. కిటికీల అద్దాలు ధ్వంసం

డార్జిలింగ్ జిల్లాలోని ఫ‌న్ సిదేవా ప్రాంతం నుంచి న్యూజ‌ల్ పైగురి వైపు వెళ్తున్న వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ రైలు సీ-3, సీ-6 కోచ్‌ల కిటికీల అద్దాలు రాళ్లదాడితో ధ్వంసమయ్యాయి. ఈ సమాచారాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అందించింది. జనవరి 3.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నంబర్- 22302) తనిఖీ చేస్తుండగా, రాళ్ల దాడి జరిగినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఇప్పటి వరకు ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. ప్రారంభించిన రెండు రోజుల్లో ఇది రెండో ఘటన జరగడం గమనార్హం.. ప్రధాని మోడీ ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. హౌరా , న్యూ జల్పాయిగురిలను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన కొద్ది రోజులకే పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారి తెలిపారు. మాల్దా నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని కుమార్‌గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలుపై ఈ రాళ్ల దాడి జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement