Wednesday, October 16, 2024

Story : 14రూట్ల‌ల్లో వందేభార‌త్ ట్రైన్స్.. డిటైల్స్ ఇవే

ఇండియాలో వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ రైలు దూసుకుపోతున్నాయి.కాగా ఫ‌స్ట్ ట్రైన్ 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. కాగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్ నుంచి రెండు వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి. ప్రస్తుతానికి ఏసీ చెయిర్, ఎగ్జిక్యూటివ్ చెయిర్ క్లాస్‌లు మాత్రమే ఉండగా.. త్వరలో స్లీపర్ వెర్షన్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది కేంద్రం. దీని కోసం ఇప్పటికే భెల్ కన్సార్షియంకు 80 ట్రైన్ల కోసం ఆర్డర్ ఇచ్చింది భారతీయ రైల్వే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 వందే భారత్ రైల్లు న‌డున్నాయి..అవేంటో. వాటి వివ‌రాలు చూద్దాం. వందేభార‌త్ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. ఇక ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్‌ను ట్రైన్ 18 అని కూడా వ్యవహరిస్తున్నారు. తొలుత చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని రూపొందించారు. ఇవి ప్రయాణికులకు అత్యంత అనువైన, సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం కోసం రూపొందించారు.న్యూదిల్లీ- కాన్పుర్- అలహాబాద్- వారణాసి రూట్‌లో దీనిని తీసుకొచ్చింది కేంద్రం. 2019, ఫిబ్రవరి 15న ఇది లాంఛ్ అయింది.

ఇది గురువారం మినహా వారంలో అన్ని రోజులు నడుస్తుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయల్దేరి.. 759 కిలోమీటర్లు ప్రయాణించి మధ్యాహ్నం 2 గంటలకు వారణాసి చేరుకుంటుంది. న్యూఢిల్లీ స్టేషన్ నుంచి కత్రాలోని మాతా వైష్ణో దేవి బేస్ క్యాంప్ వరకు నడుస్తుంది ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఈ ప్రయాణ సమయం మొత్తం 8 గంటలు. ఈ ట్రైన్ మంగళవారం మినహా మిగతా అన్ని రోజులు నడుస్తుంది. ఈ ట్రైన్ కూడా దిల్లీలో ఉదయం 6 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 2 గంటల కల్లా శ్రీ మాతా వైష్ణో దేవీ కత్రాకు చేరుకుంటుంది.ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు నడుస్తుంది. ముంబయి సెంట్రల్‌లో ఈ రైలు ఉదయం 6 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 12.25 గంటలకు గాంధీ నగర్ క్యాపిటల్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక్కడ 522 కిలోమీటర్ల దూరం ఉంది.ఈ వందే భారత్ ట్రైన్ శుక్రవారం మినహా మిగతా 6 రోజులు నడుస్తుంది. న్యూదిల్లీలో ఉదయం 5.50 గంటలకు బయల్దేరే ఈ రైలు Amb Anadaura కు మధ్యాహ్నం 11.05 గంటలకు చేరుకుంటుంది.ఈ వందే భారత్ ఎక్స్‌ప్రైస్ ట్రైన్ బుధవారం ఒక్కరోజు మినహాయించి వారంలో మిగతా అన్ని రోజులు నడుస్తుంది. చెన్నైలో ఉదయం 5.50 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 12.20 గంటలకు మైసూర్ జంక్షన్ చేరుకుంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 401 కిలోమీటర్లు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని నాగ్‌పుర్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ వరకు వెళ్తుంది. ఇది శనివారం మినహా మిగతా అన్ని రోజులు పయనిస్తుంది. నాగ్‌పుర్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.05 గంటలకు బయల్దేరి బిలాస్‌పుర్‌కు రాత్రి 7.35 గంటలకు చేరుకుంటుంది. బుధవారం మినహా మిగతా అన్ని రోజుల్లో ప్రయాణించే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హౌరా జంక్షన్ నుంచి ఉదయం 5.55 గంటలకు స్టార్ట్ అయి.. మధ్యాహ్నం 1.25 గంటలకు న్యూ జల్పాయ్‌గుడీకి చేరుకుంటుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 454 కిలోమీటర్లు కాగా.. మొత్తం జర్నీకి 7 గంటల 30 నిమిషాలు పడుతుంది.ఈ ట్రైన్ తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లోని పోర్ట్ సిటీ విశాఖపట్నం వరకు వెళ్తుంది. తెలుగు రాష్ట్రాల మధ్య వచ్చిన తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది. ఆదివారం తప్ప మిగతా 6 రోజుల్లో ఈ ట్రైన్ వెళ్తుంది. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ఈ ట్రైన్ మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి.. విశాఖపట్నం స్టేషన్‌కు రాత్రి 11.30కు చేరుకుంటుంది.

బుధవారం తప్ప వారంలో అన్ని రోజులు వెళ్తుంది ఈ ట్రైన్. ఇది ముంబయి- సోలాపుర్ మధ్య నడుస్తుంది. ముంబయి ఛత్రపతి శివాజీ టెర్నినల్ నుంచి సాయంత్రం 4.05 గంటలకు బయల్దేరి.. రాత్రి 10.40 గంటలకు సోలాపుర్ చేరుకుంటుంది. ఈ జర్నీ కోసం 6 గంటల 35 నిమిషాలు పడుతుంది.ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముంబయి CST స్టేషన్ నుంచి సాయినగర్ షిర్డీకి వెళ్తుంది. 5 గంటల 20 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇది ముంబయి నుంచి ఉదయం 6.20 గంటలకు బయల్దేరుతుంది. షిర్డీకి వెళ్లే సరికి మధ్యాహ్నం 11.40 అవుతుంది. ఇది మంగళవారం మినహా అన్ని రోజుల్లో వెళ్తుంది. ఇది భోపాల్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు వెళ్తుంది. ఇది మొత్తం 700 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది. శనివారం మినహా అన్ని రోజులు ఇది నడుస్తుంది. భోపాల్‌లో ఉదయం 5.55 గంటలకు బయల్దేరి దిల్లీకి మధ్యాహ్నం 1.45కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి నడిచే రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇది. ఈ రెండు నగరాల మధ్య దూరం 660 కిలోమీటర్లు కాగా.. 8.30 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి.. తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు వెళ్తుంది. ఇది మంగళవారం మినహా అన్ని రోజుల్లో నడుస్తుంది.ఈ ట్రైన్ చెన్నై- కోయంబత్తూర్ మధ్య నడుస్తుంది. మొత్తం 495 కిలోమీటర్ల దూరం కాగా.. 6 గంటల 10 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటుంది. బుధవారం మినహా అన్ని రోజుల్లో ఈ ట్రైన్ నడుస్తుంది. కోయంబత్తూర్ నుంచి ఇది ఉదయం 6 గంటలకు బయల్దేరి.. చెన్నైకి మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకుంటుంది.ఇది తాజాగా అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇది అజ్మేర్ నుంచి దిల్లీ Cantt మధ్య నడుస్తుంది. ఇక్కడ జైపుర్, అల్వార్, గురుగ్రామ్ స్టాప్స్ ఉంటాయి. ఇది రాజస్థాన్‌లో అందుబాటులోకి వచ్చిన తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇది 5 గంటల 15 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement