మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది.. సికింద్రాబాద్.. తిరుపతి మధ్య ఈ రైలు పరుగులుపెట్టనుంది. కాగా ఈ రైలు 662 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8.30 గంటల్లోనే చేరుకుంటుంది. ఏప్రిల్ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరనుంది. నిజానికీ రైలును ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో ప్రారంభిస్తున్నారు. అయితే, ఆ రోజున ప్రయాణికులను అనుమతించరు. ఉదయం 11.30 గంటలకు రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు రాత్రి 9 గంటలకు తిరుపతి చేరుకుటుంది. ఒక్క మంగళవారం మాత్రం ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు. టికెట్ చార్జీలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు రైలు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మధ్యలో నల్గొండ (7.19), గుంటూరు జంక్షన్ (9.45), ఒంగోలు (11.09), నెల్లూరు (12.29) స్టేషన్లలో ఆగుతుంది.తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. నెల్లూరు (5.20), ఒంగోలు (6.30), గుంటూరు జంక్షన్ (7.45), నల్గొండ (8.10) స్టేషన్లలో ఆగుతుంది. రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.వెంకన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది శుభవార్తే.
Advertisement
తాజా వార్తలు
Advertisement