ఇప్పటికే సికింద్రాబాద్ నుండి రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. కాగా త్వరలో మూడోది కూడా రానుంది. కాగా ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్-నాగ్‌పూర్ మధ్య రైలును తీసుకురావాలని యోచిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ఐదారుగంటల్లోనే ప్రయాణించే అవకాశం లభిస్తుంది. కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు వంటి పట్టణాలకు వందేభారత్ రైళ్లు నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్ విద్యావ్యాపార, ఐటీలకు కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. దీంతో దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తోందని అధికారులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement