Friday, November 22, 2024

వనమా రాఘవ ఇంటికి పోలీసుల ‘నోటీసులు’

పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు వనమా రాఘవ ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. అతడిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్‌ చేయకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యే కుమారుడు కావడంతోనే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. రాఘవపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో కొత్తగూడెంలో బంద్‌ను కొనసాగిస్తున్నారు. తన కుమారుడిని అప్పగిస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చెప్పినా ఇప్పటి వరకు రాఘవ పోలీసుల ఎదుటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు రాఘవ ఇంటికి నోటీసులు అతికించారు. 2001లో నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. మణుగూరు ఏఎస్పీ శబరీష్‌ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement