Friday, November 22, 2024

వీడు మామూలోడు కాదు.. యువతులు, మహిళలకి ఎర‌-రూ.40నుండి 50కోట్లు మోసం

మోస‌పోయేవారు ఉన్నంత‌వ‌ర‌కు మోసాలు చేసేవారు జ‌ల్సాగా తిరుగుతూనే ఉంటారనేదానికి నిద‌ర్శ‌నం ఈ క‌థ‌నం. అందులోనూ మ‌హిళ‌ల‌ని మోసం చేయ‌డం మ‌రీ ఈజీ అనుకున్నాడు జోగాడ వంశీకృష్ణ‌. వీడి టార్గెట్ రెండోపెళ్లికి సిద్ధమైన మహిళలు. ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికల్లో వారికి వల వేస్తాడు. మాయమాటలతో ఈజీగా పడేస్తాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని రామచంద్రరావుపేటకు ఈ కేటుగాడిని రీసెంట్ గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి.

ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఈ కేడీ జాబ్ కోసం 2014లో భాగ్యనగరం వచ్చాడు. మొదట ఓ హోటల్‌లో పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే బెట్టింగులకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత 2016లో జాబ్‌ కన్సల్టెన్సీలో చేరాడు. జాబ్స్ ఇప్పిస్తానని పలువురని చీట్ చేసి.. అడ్డంగా బుక్కయ్యాడు. జైలుకెళ్లి వచ్చాక.. తన పంథా మార్చాడు. హర్ష కూల్‌ 94, మాధురి చౌకి, గాయత్రి.. ఇలా పలు పేర్లతో ఫేక్ ఇన్ స్టా అకౌంట్స్ ఓపెన్ చేశాడు. తనను తాను అమ్మాయిగా పరిచయం చేసుకుని మహిళలతో చాట్ చేసేవాడు. ఈ ఫేక్ అకౌంట్స్ ద్వారా తనను తాను హైప్ చేసుకున్నాడు. సేవా కార్యక్రమాల పేరుతో మోసాలకు తెగబడ్డాడు.

పరిచయమైన మహిళలు ఇబ్బంది ఉంది కావాలని అడిగితే.. దోచుకున్న డబ్బులో నుంచి ఒకటి లేదా 2 లక్షలు ఇచ్చేవాడు. దీంతో వారు కూడా అతడిని ఆకాశానికి ఎత్తేవారు. ఇలా ఆరేళ్ల వ్యవధిలో సుమారు 1000-1500 మంది యువతులు, మహిళలను మోసగించినట్లు పోలీసులు ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. వారి నుంచి రూ.40-50 కోట్లు గుంజినట్లు తెలుస్తోంది. నిందితుడి బ్యాంకు అకౌంట్లోని సుమారు రూ.4కోట్ల నగదు లావాదేవీలను స్తంభింపజేశారు పోలీసులు.అస‌లు ఇన్ని కోట్లు ఎలా ఇచ్చారంటూ మ‌హిళ‌ల‌ని నిల‌దీశారు పోలీసులు. వాడి మాయ‌మాట‌ల‌కు మోస‌పోయామ‌ని వివ‌రించారు ఆ మ‌హిళ‌లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement