అవును భయ్యా.. పెళ్లి కూతురు అంటే ఎట్లుండాలే.. కొత్త బట్టలు, నగలు ధరించి వయ్యారాలు పోతూ పెళ్లి మండపానికి వస్తుంటే అస్సలు ఆ లుక్స్ వేరేగా ఉంటాయి కదా.. కానీ, ఈమె ఏంది భయ్యా.. ఇట్ల చేస్తుంది.. ఢిల్లీకి చెందిన ఓ పెళ్లి కూతురు చాలా వెరైటీగా తన పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేసుకున్నది. భారీ లెహంగా.. ఒంటి నిండా ధగధగ మెరిసే నగలు వేసుకుని మరీ.. పెళ్లి డ్రెస్సులోనే తన ఫిట్నెస్ స్కిల్స్‌ను ప్రదర్శించింది.
ఫటా ఫటా పుష్ అప్స్ చేసి అందర్నీ స్టన్ చేసిందంటే నమ్మలేం కానీ, ఈ వీడియో చూస్తే మటుకు ఇదే ఖాయం చేస్కోవాలే.. మల్లా అక్కడ ఇక్కడ కాదు భయ్యో.. ఏకంగా ఓ సెలూన్‌లోనే ఆమె తన వర్కౌట్ డ్రిల్ చేసింది. పెళ్లి కూతురి డ్రెస్సులోనే పుష్ అప్స్ చేసిన ఆమె వీడియోకు తెగ లైక్‌లు వచ్చేస్తున్నాయి. లెహంగా, జ్వలరీతో వర్కౌట్ చేసిన ఆ వీడియోను ఒకరు ట్వీట్ చేశారు. 12 సెకన్లు ఉన్న ఆ వీడియోను గంటల్లోనే వేలాది మంది షేర్ చేశారు. ‘‘అవును రాధికా, గిట్లసుత ఉంటదా.. ఇట్లాంటి ముచ్చట నాకెప్పుడు చెప్పనే లేదు అంటున్నాడు’’ మన టిల్లు.. మరి మీరు కూడా చూసి ఓ లైక్ కొట్టేయండి..