2022 కొత్త సంవత్సరం తెలంగాణకు సరికొత్త ఉత్తేజాన్ని తేనుంది. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ డెవలప్ అవుతోంది. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ)లో కొత్త వ్యాక్సిన్ టెస్టింగ్ లాబొరేటరీ (వీటీఎల్) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు రెండు నెలల్లో ఇది కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలి తర్వాత పూణేలో ల్యాబ్ ఉంది.. కాగా దేశంలోనే ఇది రెండో VTL, మూడో ల్యాబోరేటరీ కానుంది.
పీఎం కేర్స్ ఫండ్ కింద సుమారు రూ.10 కోట్లతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. NIABలోని VTL ఇప్పటికే అనేక టీకా బ్యాచ్‌లను పరీక్షించడం ప్రారంభించింది. కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) ఉన్నాయి. వివిధ కంపెనీలు వివిధ రకాల వ్యాక్సిన్‌లను తయారు చేస్తున్నందున వ్యాక్సిన్‌లను వేర్వేరు ప్రోటోకాల్‌ల కోసం పరీక్షించడం జరుగుతుందని NIAB అధికారి ఒకరు చెప్పారు.
అనుభవజ్ఞులైన సిబ్బంది VTLలో పనిచేస్తున్నారని, వివిధ పరీక్షా పారామీటర్లలో టీకా బ్యాచ్‌ల పనితీరును నిర్ధారిస్తున్నారని.. వాటి రిజల్ట్, గైడ్ లైన్స్ తో కంపేర్ చేస్తున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో తయారీదారులు అదనపు వివరాలు, ప్రోటోకాల్స్ డిటేయిల్స్ అడుతున్నారన్నారు.. “ఈ ల్యాబ్‌లో నెలకు 60 నుండి 70 బ్యాచ్‌లను పరీక్షించడానికి ఎక్విప్ మెంట్ ఉంది” అని చెప్పారు.
కాగా, ల్యాబ్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన అనేక విజ్ఞప్తుల మేరకు గత సంవత్సరం కేంద్రం హైదరాబాద్, పూణేలకు VTLలను ప్రకటించింది. హైదరాబాద్‌లో VTL ఆవశ్యకతను నొక్కి చెబుతూ పరిశ్రమల శాఖ మంత్రి K T రామారావు జూన్ 2021లో అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆయన కృషితో ఇప్పుడు ల్యాబ్ అందుబాటులోకి రానుంది.
కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి తర్వాత.. ఇప్పుడు బూస్టర్ డోస్‌లపై దృష్టి కేంద్రీకరించింది ప్రభుత్వం. ఈ తరుణంలో హైదరాబాద్‌లోని VTLలో కార్యకలాపాలు ప్రారంభించడం, ఆలస్యం లేకుండా మరిన్ని బ్యాచ్‌లను విడుదల చేసేలా చర్యలు తీసుకోవడం వ్యాక్సిన్ తయారీకి మంచి సూచనగా చెప్పొచ్చు.