Tuesday, November 26, 2024

బ్రెస్ట్ క్యాన్స‌ర్ కి వ్యాక్సిన్ : డాక్ట‌ర్ ఛ‌వీజైన్ భార‌తీయురాలే

ఇప్ప‌టికే ప‌లు వ్యాధుల‌కు మందుల‌ను క‌నిపెట్ట‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే దీర్ఘ‌కాల వ్యాధుల‌కి ఇప్పుడిప్పుడే మందుల‌ను క‌నిపెడుతున్నారు ప‌లువురు వైద్యులు. కాగా మ‌హిళ‌ల‌ల్లో ఎక్కువ‌గా సోకే బ్రెస్ట్ క్యాన్స‌ర్ కి వ్యాక్సిన్ ని క‌నిపెట్ట‌నున్నారు. ఈ వ్యాక్సిన్ ని క‌నిపెట్టేది ఏ విదేశీ సంస్థో, విదేశీయులో కాదు..భార‌తీయ డాక్ట‌ర్ ఈ వ్యాక్సిన్ ని క‌నిపెట్ట‌నున్నారు. అజ్మీర్ కు చెందిన డాక్టర్ ఛవీ జైన్ ,ఆమె సహచరులు అమెరికాలో జంతువులపై ఇప్పటికే ఈ వ్యాక్సిన్ విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు ఈ బృందం మహిళలపై క్లినికల్ ట్రైల్స్ నిర్వహిస్తున్నాయి.కాగా డాక్టర్ ఛవీ జైన్ తండ్రి డాక్టర్ సంజీవ్ జైన్ అజ్మీర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ హాస్పిటల్‌లో పీడియాట్రిషియన్. తల్లి డాక్టర్ నీనా జైన్ అనస్థీషియా విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ అదేవిధంగా మాజీ విభాగాధిపతి కూడా.

ఆమె తన ప్రారంభ విద్యను అజ్మీర్ లోని సోఫియా-పీకాక్ స్కూల్ లో చేశారు. తరువాత పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మేటిక్స్ అండ్ బయోటెక్నాలజీ నుండి M.Tech, స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (EPFL) యూనివర్సిటీ, స్విట్జర్లాండ్ నుండి PhD తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలోని లెర్నర్ ఇన్‌స్టిట్యూట్ క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడ నుంచే ఆమె డాక్టర్ థామస్ బడ్.. డాక్టర్ విన్సెంట్ ట్వోహీ పరిశోధన ఆధారంగా క్యాన్సర్ వ్యాక్సిన్ ట్రయల్ టీమ్‌లో పాల్గొంటున్నారు. ఆమె ప్రస్తుతం అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి ఫిమేల్ రీసెర్చ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. ఆమె తన అత్యుత్తమ పనికి క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ అగ్ర నాయకత్వం నుంచి ప్రశంసలు, ఎక్సలెన్స్ అవార్డు.. క్వార్టర్ ఎంప్లాయీ అవార్డును అందుకున్నారు. కేస్‌వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ నుంచి ఫెలోషిప్ కూడా పొందారు. మానవులపై మొదటి అధ్యయనం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం పొందడంలో ఆమె విజయం సాధించారు. దీనికి ముందు, ఛవి చిన్నప్పటి నుండి ప్రతి పనిలో బాగా రాణించి పాఠశాల, కళాశాల స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకుంది.

ఆమె ప్రస్తుతం అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి ఫిమేల్ రీసెర్చ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. డాక్టర్ ఛవీ ఇప్పటికిప్పుడు భారత్ రావాలనే కోరిక లేదని చెప్పారు. కొత్త రోగాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డ్రగ్స్ రంగంలో ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశ్యం ఉంది. అయితే, భవిష్యత్ లో నేను ఖ‌చ్చితంగా భారతదేశానికి వచ్చి ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను అని వివరించారు. భారతీయ మహిళల్లో ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. వాతావరణం, జీవనశైలి, స్థూలకాయం, పోషకాహార లోపం, జన్యుపరమైన మార్పులు దీనికి ప్రధాన కారణాలు. దీనికి ఇంకా సమర్థవంతమైన చికిత్స లేదు. ఛావి తల్లి డాక్టర్ నీనా జైన్ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వసాధారణం, అయితే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు భారతదేశంలో కూడా చాలానే ఉన్నాయన్నారు. ఈ నేప‌థ్యంలో బ్రెస్ట్ క్యాన్స‌ర్ కి వ్యాక్సిన్ క‌నుగొనే ప‌నిలో ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement