Monday, November 18, 2024

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ టీకా పంపిణీ!

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ నుంచి 45 ఏళ్లు పైబడిన వారి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం వేయనున్నారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్, పోర్టులు, ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు, పాత్రికేయులను హైరిస్క్ కేటగిరీగా గుర్తించామన్నారు. వీరందరికీ టీకాలు వేయనున్నట్టు చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 13.13 లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 1.55 లక్షల కొవాగ్జిన్ టీకాలను రెండో డోసు కింద ఇవ్వనున్నారు. అలాగే, 11.58 లక్షల కొవిషీల్డ్ టీకాలను తొలి డోసుగా ఇస్తారు. ప్రస్తుతానికి 18-45 లోపు వారికి టీకాలు ఇవ్వడం లేదు.

మరోవైపు తెలంగాణలోనూ టీకా కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. కొవాగ్జిన్‌ రెండో డోసు వారికే పంపిణీ చేయనున్నారు. నెలాఖరు వరకు 2.50 లక్షల మందికి టీకాలు వేస్తారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో సోమవారం నుంచి టీకా పంపిణీని తిరిగి ప్రారంభిస్తున్నారు. అయితే, కేవలం రెండో డోసు వారికి.. అది కూడా కొవాగ్జిన్‌ తీసుకోవాల్సిన వారికే ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద 2.20 లక్షల కొవిషీల్డ్‌ డోసులు, 50 వేల కొవాగ్జిన్‌ డోసులున్నాయి. కొవాగ్జిన్‌ రెండో డోసును 28 రోజుల తర్వాత నుంచి తీసుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఈ టీకా రెండో డోసు పొందాల్సినవారు 2.50 లక్షలమంది ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో లక్షన్నర నుంచి 2 లక్షల కొవాగ్జిన్‌ డోసులు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement