Saturday, November 23, 2024

హైదరాబాద్ లో నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్..

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా భాగ్యనగరంలో వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా 100 సెంటర్లలో వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో ఇప్పటి వరకు 35 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు వేశారు. నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ సన్నద్ధమైంది. లబ్ధిదారులు తొలుత కొవిన్ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలా చేసుకున్న వారికే టీకాలు వేస్తామని పేర్కొన్నారు. కొవిన్‌లో పేర్లు నమోదు చేసుకున్న తర్వాత తమ సమీపంలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్లలో టీకా వేయించుకోవచ్చని వివరించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రేవంత్, సీతక్క బలపరుస్తారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement