ప్రభన్యూస్ ,హైదరాబాద్.. కొవిడ్ మహమ్మారి నియంత్రణ కు భారత ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తెలిపారు.. పంజాగుట్ట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రాజ్ భవన్ సమీపంలోని సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై గవర్నర్ ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కొవిడ్ తగ్గుముఖం పట్టినా..ప్రభావం కొనసాగుతుందన్నారు..అందువల్ల జనం కొవిడ్ నియంత్రణ పద్ధతులు పాటిస్తూ.. వ్యాక్సిన్ తో పాటు అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు..ఈ కార్యక్రమంలో అమీర్ పేట క్లస్టర్, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ .. ఎస్పీహెచ్ వో డాక్టర్ ఎన్..రేవతి, మెడికల్ ఆఫీసర్ ఇసాక్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ ను సద్వినియోగం చేసుకోండి- ప్రజలకి పిలుపునిచ్చిన గవర్నర్ తమిళిసై
Advertisement
తాజా వార్తలు
Advertisement