దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 24 కోట్ల కరోనా టీకా డోసులకు పైగా పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం 18-44 ఏళ్ల మధ్య వయసు వారిలో 19,24,924 మందికి తొలి డోసు ఇచ్చినట్లు తెలిపింది. మరో 86,450 మందికి రెండో డోసు అందజేసినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 18-44 ఏళ్ల కేటగిరీలో 3,38,08,845 మందికి తొలి డోసు, 4,05,114 మందికి రెండో డోసు అందజేసినట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 24,24,79,167 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. వీరిలో హెల్త్‌కేర్ వర్కర్లు 1,00,12,624 మంది తొలి డోసు, 69,11,311 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 1,64,71,228 మంది తొలి డోసు, 87,51,277 మంది రెండో డోసు తీసుకున్నారు.
45-60 ఏళ్ల కేటగిరీలో 7,33,23,267 మంది లబ్ధిదారులు తొలి డోసు, 1,16,22,718 మంది రెండో డోసు టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు పైబడిన కేటగిరీలో 6,16,38,580 మంది లబ్ధిదారులు తొలి డోసు, 1,95,34,203 లబ్ధిదారులు రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. 145వ వ్యాక్సినేషన్ రోజు అయిన బుధవారం 31,31,759 మంది లబ్ధిదారులకు టీకా అందజేశారు. వీరిలో 28,37,572 మంది తొలి డోసు తీసుకోగా.. 2,94,187 మంది రెండో డోసు తీసుకున్నారు.
దేశంలో 24 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ: కేంద్ర ఆరోగ్యశాఖ
Advertisement
తాజా వార్తలు
Advertisement