Saturday, November 23, 2024

Covid-19 Vaccination: ఫిబ్రవరిలో 12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్!

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. అంతేకాకుండా బూస్టర్‌ డోసును సైతం అందిస్తోంది. పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనవరి 3, 2022న ప్రారంభించారు. తాజాగా 12 ఏళ్లు పైగా పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి చివరి నాటికి 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా వెల్లడించారు.

జనవరి చివరి నాటికి కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా పెరిగే అవకాశముందన్నారు. పెరుగుతున్న కేసులను నిశితంగా పరిశీలిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement