కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేలా బూస్టర్ డోస్‌కు ప్రయత్నాలు చేస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ అదార్ పూనావాలా తెలిపారు. కొవిషీల్త్ బూస్టర్ వెర్షన్‌కు అదనపు పరిశోధనలు అవసరమని సూచిస్తే దాన్ని పరిగణిస్తామని చెప్పారు. ఒమిక్రాన్ కోసం పరీక్షలు కొనసాగుతున్నాయి. కొత్త వైరస్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇందుకు మరో రెండు వారాలు పట్టొచ్చు. ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు కూడా తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు. వారి నివేదిక ఆధారంగా మేము ఆరు నెలల వ్యవధిలో బూస్టర్‌గా పనిచేసే కొత్త వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పరిశోధన ఆధారంగా మూడో, నాలుగో డోస్ గురించి స్పష్టత ఇస్తాం అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే, ఒమిక్రాన్‌కు నిర్దిష్ట వెర్షన్ వ్యాక్సిన్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. బూస్టర్‌కు అవసరమైన స్టాక్‌లు ఉన్నాయన్నారు. దేశ వ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా డోసులు రిజర్వు చేయబడివున్నాయని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం బూస్టర్ డోస్‌ను ప్రకటిస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
కొవిషీల్డ్ కాదు.. కొవావ్యాక్స్..
భారతదేశంలో పిల్లలకు వేయాల్సింది కోవిషీల్డ్ వ్యాక్సిన్ కాదని కోవావ్యాక్స్ అని పూనావానా స్పష్టం చేశారు. మరో ఆరు నెలల్లో కోవావ్యాక్స్ అందు బాటు లోకి వస్తుందని చెప్పారు. ట్రయల్స్ కొనసాగుతు న్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి భద్రత సమస్యలు లేవు. మేము ఏడేళ్లు పైబడిన వారిలో మెరుగైన ఫలితాలు గమనించాం. రెండేళ్ల లోపువారికి కోవా వ్యాక్స్ టీకాలు వేయాలన్నది మా విధానం. ఈ టీకా నిల్వలు చాలానేవున్నాయి అని వివరించారు. అమె రికాలో నోవావ్యాక్స్గా పిలువబడే వ్యాక్సిన్‌ను యూరప్ మార్కెట్లోకి కోవావ్యాక్స్ పేరుతో ప్రవేశపెట్ట నున్నారు. అయితే నియంత్రణ విధానపరమైన అనుమతులు ఆలస్యం అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..