ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ లో పలు పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా జూనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ నర్స్, మెడికల్ సోషల్ వర్కర్, రీసెర్చ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, MTSతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల (సెప్టెంబర్) 20వ తేదీ దాకా ఉంది.
ఖాళీల వివరాలు
- జూనియర్ మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు
- జూనియర్ నర్స్: 01 పోస్టు
- మెడికల్ సోషల్ వర్కర్ : 01 పోస్టు
- రీసెర్చ్ అసిస్టెంట్: 01 పోస్టు
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్ట్
- MTS: 01 పోస్ట్
- టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హతలు
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. అధికారిక వెబ్సైట్ నుండి అభ్యర్థులు తమ అర్హతకు సంబంధించిన పూర్తి వివరాలను చెక్ చేయవచ్చు. అన్ని పోస్ట్ లకు వేర్వేరు విద్యార్హతలను కేటగిరీలో నిర్ణయించారు.
ఏజ్ లిమిట్ ఎంతంటే..
జూనియర్ మెడికల్ ఆఫీసర్ అభ్యర్థుల వయోపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. జూనియర్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వయోపరిమితి 28 సంవత్సరాలు. మెడికల్ సోషల్ వర్కర్, టెక్నికల్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్లకు వయోపరిమితి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. MTS కోసం వయోపరిమితి 25 సంవత్సరాలుగా ఉంది.
పే స్కేల్ ఎంతంటే..
జూనియర్ మెడికల్ ఆఫీసర్‌కు రూ.60,000, జూనియర్ నర్సు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.18,000, మెడికల్ సోషల్ వర్కర్‌కు రూ.32000, రీసెర్చ్ అసిస్టెంట్‌కు రూ.31,000, ఎంటీఎస్ పోస్టుకు రూ.31,000 చొప్పున చెల్లించనున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి రూ.20,000 వేతనం ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ముందుగా అభ్యర్థులు main.icmr.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఆపై హోమ్‌పేజీలో ‘కెరీర్స్’ విభాగంలో సంబంధిత రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ని క్లిక్ చేయండి. తర్వాత దరఖాస్తు ఫారమ్ ఫిల్ చేసి సెండ్ చేయాలి.