అసలే కార్తీకమాసం ..శివాలయాలు భక్తులతో నిండుతున్న సమయం..ఇటువంటి సమయంలో ఉత్తర ప్రదేశ్ వారణాసీలోని కాశీ విశ్వనాథ ఆలయం మూడు రోజులు మూతపడనుంది. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా మూసివేశారు అధికారులు..దీంతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నారు..డిసెంబర్ 13న కాశీ విశ్వనాథ ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికార యంత్రాంగం.. భక్తుల దర్శనం నిలివేయడం చరిత్రలో ఇది రెండవసారి. గతంలో, కరోనా వ్యాప్తి సమయంలో మొదటిసారి జరిగింది.. ఆలయంలో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. గత సంవత్సరం దర్శనంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినప్పటికీ.. ఇప్పుడు డిసెంబర్ 13న శ్రీకాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రారంభోత్సవాని ఆలయాన్ని మరోసారి మూసివేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital