Tuesday, November 19, 2024

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో విద్యార్థుల‌కు స్మార్ట్ ఫోన్స్ , ల్యాప్ టాప్స్

ఎన్నిక‌లు స‌మీపిస్తే చాలు అక‌స్మాత్తుగా ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపిస్తుంటారు రాజ‌కీయ నాయ‌కులు. కాగా మ‌రో రెండు నెల‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ,విద్యార్థులకు లాప్ ట్యాప్ లు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి సందర్భంగా ఈనెల 25న ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే వాజ్ పేయి జయంతిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా ,ఎన్నికల కోసమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ ఎన్నిక‌ల కోసం ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టిన సమాజ్ వాదీ పార్టీ జాతీయ నేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ యోగికి ల్యాప్ టాప్ ఆపరేటింగ్ తెలియదు… అందుకే వాటిని విద్యార్థులకు పంపిణీ చేస్తున్నార‌న్నారు.

యూపీలో రెండోసారి అధికారంలోకి రావడం బీజేపీకి కత్తిమీద సాములా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీకి లఖింపూర్ మచ్చ పడింది. రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి కుమారుడు అజిత్ మిశ్రా రైతులను తొక్కి చంపాడని ఆరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుపుతూ నిందితులను అరెస్టు చేసినా ఆ వేడి చల్లారడం లేదు. దీంతో రైతులు బీజేపీపై ఆగ్రహంగానే ఉన్నట్లు స‌మాచారం. మరోవైపు ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ ప్రతిపక్షాలు యాత్రలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై సంవత్సరం పాటు ఆందోళన చేసిన రైతులు ఇటీవలే ఇంటిముఖం పట్టారు. కానీ మరణించిన రైతుల విషయంలో పరిహారం గురించి ఏ విధమైన ప్రకటన చేయలేదు. దీంతో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం కల్పించ‌డంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నారు. అయితే వీటి ఎఫెక్ట్ పడకుండా ఇటీవల ప్రధాని మోడీ స్వయంగా యూపీలో పర్యటించి జ‌నాల‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే యూపీ ఓటర్ నాడీ ఎటువైపు ఉందో అప్పుడే చెప్పలేమని కొన్ని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. ఎన్నికల సమయం అతి కొద్ది దూరంలో ఉన్నందున‌ అధికార బీజేపీ మరోసారి గెలిచేందుకు వ్యూహాలు ర‌చిస్తోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల వారీగా ఇన్ ఛార్జ్ ల‌ను నియమించింది. పశ్చిమ ప్రాంతం బీజ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను నియమించారు. బ్రీజ్ ఏరియాకు రక్షణ మంత్రి అవథ్ కాశీ ప్రాంతాల బాధ్యతలు అప్పగించారు. కాన్పూర్ రీజియన్ లకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నియమించారు. అలాగే బూద్ అధ్యక్షులుగా పార్టీ ఇన్ చార్జులను నియమించారు. మ‌రి గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement