భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ బీభత్సంగా మారింది. ఒకవైపు వరదలు, మరోవైపు కొండచరియలు విరిగిపడుతూ టూరిస్టుల ప్రాణాలు తీస్తున్నాయి. రాంఘర్ తాళ్ల ఏరియా మొత్తం నీట మునిగింది. వరదల్లో చిక్కుకున్న చాలా మంది ఇండ్ల పైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ హైవే మొత్తం బ్లాక్ అయ్యిందని, కొండలపై నుంచి మట్టిపెల్లలు, రాళ్లు పడుతున్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ రెండు రోజుల్లోనే 23 మంది చనిపోయారని, దాదాపు 100 మందికి పైగా రెస్క్యూ చేసి కాపాడినట్టు అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement