ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపధ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్ కు అభయహస్తం అందించింది. ఉక్రెయిన్ కి భారీగా ఆర్థిక సహాయం చేసింది. 600 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించింది. తక్షణ సైనిక అవసరాలకు ఇది వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌కు తక్షణ సైనిక సహాయంగా 600 మిలియన్ డాలర్లు అందించడానికి US అధ్యక్షుడు జో బిడెన్ ఒక మెమోరాండంపై సంతకం చేశారు. ఉక్రెయిన్ ను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఇప్పటికే ఆమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించగానే ఆమెరికా రష్యాపై అనేక ఆంక్షలను విధించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement