జూలైలో అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీం కోర్టు తన తుది తీర్పును వెలువరించాల్సి ఉంది. లీకైన సమాచారంపై సుప్రీంకోర్టు కానీ వైట్‌హౌజ్ కానీ స్పందించలేదు. అబార్షన్ హక్కులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఎన్నికైన ప్రతినిధులకు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని ఆ ముసాయిదాలో వ్యక్తం చేసిందట. రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన వివరణ చాలా బలహీనంగా ఉందని, దాని పరిణామాలు ప్రమాదకరంగా ఉన్నట్లు జస్టిస్ అలిటో అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్ నేతలు నియమించిన న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పు సరిగా లేదని లీకైన డాక్యుమెంట్‌పై విమర్శలు వస్తున్నాయి..కాగా పలువురు సుప్రీంకోర్టు ముందు నిరసన చేపట్టారు.దాంతో అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ హక్కుల్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతున్నట్లు ఓ ముసాయిదా రిలీజైంది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. జస్టిస్ సామ్యూల్ అలిటో ఆ ముసాయిదాలో కొన్ని కీలక అంశాలను రాశారు. 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును జస్టిస్ సామ్యూల్ తప్పుగా చిత్రీకరించారు. అయితే ప్రస్తుతం సుప్రీం కోర్టు నుంచి డాక్యుమెంట్ లీక్ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదట.
Advertisement
తాజా వార్తలు
Advertisement