చైనీస్ యాప్స్‌పై విధించిన నిషేదాన్ని అమెరికా ఎత్తివేసింది. టిక్ టాక్, వీచాట్ సహా పలు చైనాకు చెందిన యాప్స్‌పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎత్తివేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. టిక్ టాక్, వీ చాట్ సహా ఎనిమిది ఇతర సాఫ్ట్వేర్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినట్లు వైట్ హౌస్ తెలిపింది.
అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు లేకపోతే ఉపసంహరణకు బిడెన్ సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 2020లో అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్, వీచాట్ వంటి చైనా యాప్‌లను అమెరికా యాప్‌స్టోర్ నుంచి తొలిగించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు అమెరికాలో నిర్వహించకుండా నిషేధించారు. దేశ భద్రతకు ముప్పు ఉండనే ఆరోపణలతో చైనా యాప్ లపై నిషేధం విధించారు.
కాగా, చైనీస్ యాప్స్ ను భారత్ కూడా నిషేదించిన సంగతి తెలిసిందే. సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చైనాకు చెందిన 59 సంస్థలకు చెందిన యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో టిక్‌టాక్‌తో పాటు షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, హలో, వీ చాట్, బ్యూటీ ప్లస్ తదితర కీలక యాప్‌లు ఉన్నాయి. భారత్ చైనా యాప్ లపై నిషేధం విధించిన తరువాత అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం చైనా యాప్ లపై నిషేధం అమలు చేశారు. ఫలితంగా అత్యంత పాపులర్ అయిన టిక్ టాక్ పై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా తరువాత దాదాపు అన్ని దేశాలు టిక్ టాక్ , పలు చైనా యాప్స్ పై నిషేధం విధించాయి.
ఇదీ చదవండి: రాందేవ్ బాబాకు షాక్.. కరోనిల్‌పై నేపాల్ నిషేధం