తనను చూసేందుకు వచ్చిన వారి వద్దకి వెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు జో బెడైన్ సైకిల్ ఎక్కి బయలు దేరారు. సైకిల్ తొక్కుతోన్న సమయంలో అనుకోకుండా కిందపడ్డారు అమెరికా అధ్యక్షుడు. అయితే ఆయనకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డెలావర్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న కేప్ హెన్లోపెన్ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. సైకిల్ దిగే సమయంలో బైడెన్ పాదం పెడల్‌లో ఇరుక్కుపోయింది. దీంతో కిందికి దిగాలని భావించారు. ఈ క్రమంలో తూలి కుడివైపునకు పడిపోయారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపారు. ఈ ఘటన తర్వాత బైడెన్ మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని అన్నారు. ఈ ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement