లాస్ఏంజిల్స్: జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత కూడా అమెరికా పోలీసుల వైఖరిలో మార్పురాలేదు. ఆ తర్వాత కూడా మరో నల్ల జాతీయుడు నికోలస్ పోలీసుల ఆహంకారానికి బలయ్యాడు.. ఈ ఘటన మరవకముందే అమెరికాలో ఓ పోలీస్ రౌడీలా రెచ్చిపోయాడు. ఓ నల్లజాతి మహిళను మెడపట్టి బలంగా నేలకు కొట్టాడు..! అనంతరం ఆమె పైకి లేవకుండా మోకాళ్లతో తొక్కిపెట్టాడు.. ఆమె అరుపులు ఆపడానికి ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లాడు..! ఆ తర్వాత చేతులకు సంకెళ్లు వేశాడు..! అమెరికా పోలీసులను తీవ్ర విమర్శలపాలు చేసిన ఈ ఘటన.. లాస్ ఏంజిల్స్ కౌంటీలోని లాంకస్టర్‌లోగల వింకో సూపర్ మార్కెట్ ఎదుట జరిగింది.
వివరాల్లోకి వెళ్తే కిరాణ సరుకుల కోసం జూన్ 24న బాధిత మహిళ తన భర్తతో కలిసి వింకో సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ సామాను కొనుగోలు చేసి బయటికి వస్తుండగా సూపర్ మార్కెట్ సిబ్బంది వాళ్లను అడ్డగించారు. కొన్ని వస్తువులను బిల్లింగ్ చేయించకుండా తీసుకెళ్తున్నారని పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో పోలీసులు వచ్చి బాధితురాలి భర్తను బయటికి ఈడ్చుకెళ్లారు. పెనుగులాడుతున్న అతని చేతికి పోలీసులు సంకెళ్లు వేస్తుండగా ఆ మహిళ తన సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం మొదలుపెట్టింది.
This is Lancaster, California.
— Bishop Talbert Swan (@TalbertSwan) July 4, 2023
A Los Angeles county sheriffs deputy throws a Black woman to the ground and brutalized her for filming them arresting her husband.
Filming the police is not illegal.
This is brutality.
Arrest this pig. pic.twitter.com/BKg9dnZX7M
ఇది గమనించిన ఓ పోలీస్ అధికారి కోపంతో ఆమెవైపు పరుగెత్తుకొచ్చాడు. ఆమె మెడపట్టి బలంగా నేలకు కొట్టాడు. ఆపై ఆమె పైకి లేవకుండా మోకాళ్లతో తొక్కిపెట్టాడు. ఆమె అరుస్తూ గింజుకున్నా విడిచిపెట్టలేదు. పైగా అరవద్దంటూ ముఖంపై కొట్టాడు. అయినా ఆమె అరుపులు ఆపకపోవడంతో ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లాడు. ఆఖరి ఆమె చేతులకు సంకెళ్లు వేశాడు. భార్యభర్తలు ఇద్దరినీ కౌంటీ షరీఫ్‌కు తీసుకెళ్లి దొంగతనం కేసులో బుక్ చేశాడు. కాగా, పోలీస్ దౌర్జన్యాన్ని మరో మహిళ తన ఫోన్‌లో రికార్డు చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీనిపై అమెరికా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.. పోలీసులపై చర్చలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వెల్లువెత్తుతున్నాయి..