Saturday, November 23, 2024

భారత్ కు అమెరికా వ్యాక్సిన్ సాయం..

కరోనా వ్యాక్సిన్ల విషయంలో ఆసియా, ఆఫ్రికా దేశాలకు అండగా నిలవాలని అగ్రరాజ్యం అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు ఇతర దేశాలతో వ్యాక్సిన్‌ షేరింగ్‌ విధానాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఇందులో భారత్‌, మెక్సికో, కెనడా, దక్షిణ కొరియా ఉన్నాయి. ఇందులో భాగంగా భారత్‌కు అందించనున్న వ్యాక్సిన్ల గురించి అమెరికా అధ్యక్షురాలు కమలా హ్యారిస్‌.. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా అమెరికా నిర్ణయంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం, అక్కడి వ్యాపారవర్గాలు, అమెరికాలోని భారతీయులు భారత్‌కు మద్దతుగా నిలవడంపై మోదీ ధన్యవాదాలు తెలిపారు. అమెరికా విధానాన్ని ప్రకటిస్తూ.. వివిధ దేశాల కంపెనీలు కలిసి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడానికి అవరోధంగా తయారైన మేధో సంపత్తి హక్కుల నిబంధనలను కూడా ఎత్తివేయనున్నట్టు జో బైడెన్‌ తెలిపారు. ఈ నెలాఖరుకు మొత్తం 8 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను వివిధ దేశాలకు సరఫరా చేయనున్నట్టు పేర్కొన్నారు. మొదటి విడతగా 2.5కోట్ల వ్యాక్సిన్‌ డోసులను కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement