గత నెల బెర్లిన్ పర్యటనకు వెళ్లారు అమెరికా హెల్త్ సెక్రటరీ జేవియర్ బెకెర్రా. అప్పుడు ఆయనకి కరోనా పాజిటీవ్ అని తేలగా చికిత్స తీసుకుంటూ క్వారంటైన్ లోకి వెళ్లారు..కాగా మరోసారి కరోనా బారిన పడ్డారు జేవియర్ బెకెర్రా. కాలిఫోర్నియా, లాస్ ఏంజెలిస్‌లో ఇటీవల జరిగిన కాంట్రవర్షియల్ సమావేశం సమిట్ ఆఫ్ ది అమెరికాస్ లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత శాక్రమెంటోలో బెకెర్రాకు చేసిన యాంటీజెన్ టెస్టులో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. అయితే వీళ్లిద్దరికీ కూడా బెకెర్రా క్లోజ్ కాంటాక్ట్ కాదని, కావున వారికి కరోనా సోకిందనే భయం అక్కర్లేదని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. కాగా బెకెర్రా రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారని, ప్రస్తుతం ఆయనలో చాలా మైల్డ్ కరోనా లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆరోగ్య శాఖ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతానికి బెకెర్రా ఐసోలేషన్‌లో ఉన్నారు, అక్కడి నుంచే తన బాధ్యతలు నిర్వర్తిస్తారట.
Advertisement
తాజా వార్తలు
Advertisement