అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకా పంపిణీని నిలిపివేయాలని FDA సూచించింది. ఇప్పటివరకు అమెరికాలో 68 లక్షల మందికి జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను పంపిణీ చేయగా.. టీకా వేసుకున్న వారిలో ఆరుగురు మహిళలకు రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. దీంతో టీకాను తాత్కాలికంగా నిలిపివేయాలని US FDA ఆదేశించింది. త్వరలో ఈ టీకాకు మరిన్ని పరీక్షలు నిర్వహించే ఛాన్సుంది.
అటు భారత్‌లో కరోనా విజృంభిస్తున్న వేళ టీకాల కొరతను అధిగమించేందుకు కేంద్రం ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల జాబితాలో మరికొన్నింటిని చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని యోచిస్తోంది. ఫలితంగా జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తయారీ సంస్థను భారత్ ఆహ్వానించింది. రెండు, మూడు దశల ప్రయోగం తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు భారత్ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.