Wednesday, November 20, 2024

Spl Story: పదే పదే యూరిన్​ వస్తోందా, యూటీఐ ఇన్​ఫెక్షన్​ కావచ్చు?.. క్రాన్​బెర్రీ ఫ్రూట్స్​తో ఎంతో రిలీఫ్​!

యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) అనేది ఒక బ్యాక్టీరియల్​ ఇన్​ఫెక్షన్​.- మూత్రపిండాలు, మూత్ర నాళాలు, మూత్రాశయం, మూత్రనాళంలో అంటువ్యాధులకు సంబంధించిన పలు అంశాలు దీనితో ముడిపడి ఉంటాయి.  మగాళ్ల కంటే ఆడాళ్లకు UTI ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. మూత్రాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఎంతో బాధను కలుగుజేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలకు వ్యాపించే ప్రమాదమూ ఉంటుంది.  అయితే.. డాక్టర్లు యాంటీబయాటిక్స్ తో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేస్తారు. కానీ, దీని ఇన్​ఫెక్షన్​ సోకిన తొలి దశలోనే UTI నుంచి రిలీఫ్​ పొందవచ్చు. 

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

మాన్​సూన్​ సీజన్​లో గాలిలో తేమతోపాటు.. వర్షంలో తడవడం, కలుషితమైన ఫుడ్​, నీళ్లు తాగడం వంటి పలు కారణాలు యుటీఐ (యురినరీ ట్రాక్ట్​ ఇన్​ఫెక్షన్​) రావడానికి కారణం అవుతుంది. ఇట్లాంటి ప​లు కారణాలు వర్షాకాలంలో అంటువ్యాధులను వ్యాప్తింపజేస్తాయి. చాలా రకాల వైరస్​లు, బ్యాక్టీరియాలకు మానవుల మర్మ ప్రదేశం (ప్రైవేట్​ పార్ట్స్​) ఒక ఆవాసంగా మారుతుంది. మూత్రంలోకి బాక్టీరియా ప్రవేశించి వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు వచ్చే అత్యంత సాధారణ అంటువ్యాధులలో యుటిఐ ఒకటిగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

UTI సాధారణంగా మూత్రనాళంలో మొదలవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే మూత్రపిండాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూత్ర విసర్జన సమయంలో తేలికపాటి నొప్పి, మంట ఉంటుంది. వాష్‌రూమ్‌కు పదే పదే వెళ్లాలనే సెన్సేషన్​ నిరంతరం కలుగుతుంది. మూత్రం ముదురు రంగులో వస్తుంది. విపరీతమైన ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు జ్వరం కూడా ఉండవచ్చు.

అయితే.. ఈ ఇన్‌ఫెక్షన్‌కు ట్రీట్​మెంట్​ కోసం డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్​ కోర్సు కాకుండా, అనేక సహజ నివారణల ద్వారా కూడా సమస్యను తగ్గించుకోవచ్చు. అందులో ఒకటి క్రాన్బెర్రీస్ ఫ్రూట్స్​ తీసుకోవడం. ఇది బ్యాక్టీరియా రాకుండా అడ్డుకుంటుంది. బోస్టన్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం ఒక గ్లాసు క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగడం.. లేదా ఫ్రూట్స్​ని తినడం వల్ల UTIలకు మంచి నివారణ చర్యగా పేర్రొంటున్నారు. అంతేకాకుండా అంటువ్యాధుల చికిత్స కోసం యాంటీబయాటిక్స్ వాడకాన్ని కూడా నెమ్మదిగా తగ్గించవచ్చని చెబుతున్నారు.

- Advertisement -

క్రాన్బెర్రీ ఎలా పని చేస్తుందంటే..

క్రాన్‌బెర్రీస్‌లో ప్రోయాంతోసైనిడిన్స్ అనే పదార్ధం పుష్కలంగా ఉంటుంది. ఇవి మూత్ర నాళాల గోడలకు బాక్టీరియా అంటుకోకుండా చూస్తుంది. శరీరం నుండి ఇతర టాక్సిన్స్ తో పాటు ఇట్లాంటి బ్యాక్టీరాయలు కడిగినట్టు శుభ్రం అవుతాయి. ఈ ఫ్రూట్​ ఒక గొప్ప యాంటీఆక్సిడెంట్​గానూ.. అంతేకాకుండా బ్యాక్టీరియాని కూడా పెరగనివ్వకుండా చూస్తుంది.

క్రాన్బెర్రీ ఇతర ప్రయోజనాలు:

• క్రాన్బెర్రీస్ ఫినోలిక్ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి కణాల పునరుత్పత్తి.. మరమ్మతులో సహాయపడతాయి.

• ప్రభావిత ప్రాంతంలో వాపును తగ్గిస్తాయి. 

• గట్ బ్యాక్టీరియాను మాడ్యులేట్ చేస్తాయి

గమనిక: ఆర్టికల్​లో పేర్కొన్న చిట్కాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. వృత్తిపరమైన వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించే ముందు లేదా మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు మీ వైద్యుడిని లేదా డైటీషియన్‌ని సంప్రదించండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement