Friday, November 22, 2024

Breaking : ఏపీలో రెండో అధికార భాష‌గా ఉర్దూ – అసెంబ్లీలో ఏక‌గ్రీవంగా ఆమోదం

ఏపీలో రెండో అధికార భాష‌గా ఉర్దూ కొన‌సాగ‌నుంది. ఈ మేర‌కు వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. దాంతో ఏపీలో రెండో అధికార భాష‌గా ఉర్దూకు అరుదైన గుర్తింపు ల‌భించింది. శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాల కంటే ముందుగానే రాష్ట్రంలో ఉర్దూకు రెండో అధికార భాష‌గా గుర్తింపు ఇవ్వ‌నున్న‌ట్లుగా వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగానే బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాగానే.. ప‌లు బిల్లుల మాదిరిగానే ఉర్దూ బిల్లును కూడా అసెంబ్లీ ముందు పెట్టింది. బుధ‌వారం నాటి స‌మావేశాల్లో భాగంగా ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement