కరోనావైరస్తో ఇప్పటికే పలు పరీక్షలను వాయిదా వేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షను యూపీఎస్సీ వాయిదా వేసింది. జూన్ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూపీఎస్సీ గురువారం విడుదల చేసిన ప్రకటన ద్వారా వెల్లడించింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఏటా ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అని మూడు దశల్లో నిర్వహిస్తారు. ఇక సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం మే 31న జరగాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ పేర్కొంది.
సివిల్ సర్వీసెస్ పరీక్ష మూడు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా ప్రిలిమ్స్ ఆ తర్వాత మెయిన్స్ అటుపై ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది యూపీఎస్సీ. ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తుంటారు. ఇక ఈ ఏడాది దాదాపుగా 796 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది యూపీఎస్సీ.