Wednesday, November 20, 2024

Big Breaking | ఓపెనింగ్​కు రెడీగా ఉప్పల్​ స్కైవాక్.. ఇవ్వాలే ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్​​

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) రూ.25 కోట్లతో నిర్మించిన ఉప్పల్ స్కైవాక్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మెహిదీపట్నంలో కూడా ఇదే తరహాలో స్కైవాక్‌ను త్వరలో నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఉప్పల్ స్కైవాక్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) ఇవ్వాల (సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్​లోని ఉప్పల్ జంక్షన్ ప్రాంతంలోని పాదచారులకు 660 మీటర్ల పొడవున్న అద్భుతమైన ఇంజినీరింగ్ కట్టడం ఒక గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది. ఎందుకంటే ఇది రద్దీగా ఉండే జంక్షన్‌ను దాటడానికి సురక్షితమైన, అనుకూలమైన ప్రదేశంగా మారనుంది. ఉప్పల్ స్కైవాక్‌లో ఆరు హాప్ స్టేషన్లు, తొమ్మిది లిఫ్టులు ఉన్నాయి. ఈ సౌకర్యాలు ఉప్పల్ జంక్షన్, సమీపంలోని మెట్రో స్టేషన్‌లోని ప్రదేశాలకు ఈజీగా  వెళ్లే అవకాశం కలుగుతుంది. 

స్కైవాక్ యొక్క వ్యూహాత్మక ప్రదేశం, పాఠశాలలు, వ్యాపారాలు, నివాస ప్రాంతాలు, స్పోర్ట్స్ స్టేడియం,  మెట్రో స్టేషన్‌కి ఆనుకొని ఉండటం వలన ఇది వీటన్నిటి విభిన్న అవసరాలను తీర్చగలదని చెప్పుకోవచ్చు.

త్వరలోనే మెహదీపట్నంలోనూ స్కైవాక్..

- Advertisement -

మెహదీపట్నంలో కూడా సేమ్​ టు సేమ్​ ఇట్లాంటి స్కైవాక్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 390 మీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఈ స్కైవాక్‌లో 11 ఎలివేటర్‌లు ఉంటాయి. పాదచారులు సందడిగా ఉండే జంక్షన్‌లోని వివిధ ప్రాంతాలను సులభంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుంది. స్కైవాక్‌లో రైతు బజార్, డిఫెన్స్ కాంపౌండ్ వాల్, మెహదీపట్నం బస్ బే ఏరియా, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్,  గుడిమల్కాపూర్ జంక్షన్ వంటి ప్రముఖ ప్రదేశాలకు సమీపంలో ఐదు హాప్-ఆన్ స్టేషన్‌లు ఉండనున్నట్టు తెలుస్తోంది.

రద్దీగా ఉండే ఈ జంక్షన్‌ను దాటేటప్పుడు తరచూ సవాళ్లను ఎదుర్కొనే స్థానికులకు ఈ స్కైవాక్ ద్వారా చాలా ఈజీగా రోడ్డు దాటే అవకాశం కలగనుంది. రెండు స్కైవాక్‌లు అంటే ఉప్పల్,  మెహిదీపట్నం హైదరాబాద్‌లోని పాదచారులకు ఎంతో రిలీఫ్​ కలిగించబోతాయనడంలో ఆశ్యర్యమేమీ లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement