ఉప్పల్ స్టేడియంకి విద్యుత్ ని నిలిపివేశారు విద్యుత్ శాఖ అధికారులు. కోట్ల రూపాయల్లో బకాయిలు పేరుకుపోవడంతో కరెంట్ సప్లైను ఆపివేశామని తెలిపారు. కరెంటు బిల్లులు కట్టక పోవడంతో… గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై విద్యుత్ శాఖ కేసు వేసింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో… వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ… హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటు సరఫరా నిలిపివేశారు విద్యుత్ అధికారులు. ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం పై ఏకంగా మూడు కోట్లకు పైగా బిల్లులు ఉన్నట్లు సమచారం. మరి ఇప్పటికైనా స్పందించి కరెంట్ బిల్లుల బకాయిని కడతారేమో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..