ది కశ్మీర్ ఫైల్ చిత్రానికి వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని బిజెపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. కొందరు ఈ సినిమా పేరుతో కోట్లు సంపాదిస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం పోస్టర్లు అంటించేవారిగా మారిపోయారంటూ విమర్శించారు.అందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అయితే.. ఆ సినిమాను ఫ్రీగా చూడటానికి వీలుగా.. య్యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొచ్చు కదా అన్నారు. సినిమాపై వినోద రాయితీ ప్రకటించడం కంటే.. సినిమాను యూట్యూబ్‌లో పెట్టమని వివేక్ అగ్నిహోత్రికు సలహా ఇవ్వండనీ, ఒక్కరోజులో ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూస్తారు. ఎక్కడ కూడా పన్ను కట్టవాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ కామెంట్ చేశారు. కొందరు ఈ సినిమా పేరుతో కోట్లు సంపాదిస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం పోస్టర్లు అంటించేవారిగా మారిపోయారంటూ విమర్శించారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ నవ్వులమయమైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపారు.
వినోదపన్ను వద్దనుకుంటే యూట్యూబ్ లో రిలీజ్ చేయండి – ‘ద కశ్మీర్ ఫైల్’ చిత్రంపై సీఎం కేజ్రీవాల్ కామెంట్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement