Saturday, November 23, 2024

UPI Server Down : నిలిచిపోయిన పేటీఎం, గూగుల్‌ పే సేవలు..

యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ/ UPI) సర్వర్ డౌన్ (Server Down) అయింది. దీంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్‌లైన్ పేమెంట్ సేవలు స్తంభించాయి. గూగుల్ పే, పేటీఎం వంటి సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసెస్‌లు అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఈ యూపీఐని అభివృద్ధి చేసింది. ఈ యూపీఐ ఆధారంగానే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలు పని చేస్తాయి. కానీ, ఈ రోజు సుమారు ఓ గంట సేపు యూపీఐ సర్వర్ డౌన్ అయింది. దీనితో డిజిటల్ వ్యాలెట్, ఆన్‌లైన్ పేమెంట్ సేవలకు సుమారు ఒక గంట సేపు అంతరాయం వాటిల్లింది.

కాగా, సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో ఎన్‌పీసీఐ ఈ అంశంపై ఓ వివరణ ఇచ్చింది. అప్పుడప్పుడు సంభవించే ఇలాంటి అంతరాయల వల్ల కొందరు యూపీఐ యూజర్లు సమస్య ఎదుర్కొన్నారని పేర్కొంది. ఈ అంతరాయానికి చింతిస్తున్నట్టు తెలిపింది. అయితే, యూపీఐ ఇప్పుడు మళ్లీ సేవలు అందిస్తున్నదని వివరించింది. ఈ వ్యవస్థను తాము ఇప్పుడు మరింత తీక్షణంగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement