కర్నాటక కాంగ్రెస్కు ఇది పిడుగులాంటి వార్త. కాంగ్రెస్ మూల స్తంభాల్లో ఒకరైన మాజీ సీఎం సిద్ధ రామయ్య సంచలన ప్రకటన చేశారు. వచ్చే 2023 ఎన్నికలే తన చివరి ఎన్నికలని ప్రకటించేశారు. రాజకీయాల్లో ఉంటాను కానీ.. 2023 తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే విధానంలో మాత్రం ఉండబోనని తేల్చి చెప్పారు సిద్ధరామయ్య..
శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఇక.. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారోనన్నది మాత్రం ఆయన ఇంకా చెప్పలేదు. తమ అధిష్ఠానం ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందో.. ఆ విధానానికే తాను కట్టుబడి ఉంటానని ప్రకటించారు. రాజకీయాల్లో ఉంటాను. కానీ ప్రత్యక్ష పోటీకి మాత్రం దూరంగా ఉంటా. రాబోయే ఎన్నికలే ఆఖరి ఎన్నికలు అని ప్రకటించారు సిద్ధరామయ్య.