Saturday, November 23, 2024

Posters: యూపీ + బిహార్​ = గయీ మోదీ సర్కార్​.. ఆకట్టుకుంటున్న పోస్టర్లు, నెట్టింట వైరల్​!

యూపీ + బిహార్​ = గయీ మోదీ సర్కార్​ అంటూ కొన్ని పోస్టర్లు ఇప్పుడు నెట్టింట హల్​చల్​ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్​, బిహార్​ రాష్ట్రాల్లో పట్టుసాధించి ఎక్కువ సీట్లు కనుక గెలుచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఈజీ అవుతుందని, అప్పుడు బీజేపీని సునాయసంగా గద్దె దింపొచ్చని ఈ పోస్టర్ల వెనుక ఉన్న సమాచారం.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నాల్లో భాగంగా జేడీ(యూ) లీడర్​, బిహార్ సీఎం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌లు కలిసిన కొద్ది రోజులకే సమాజ్​వాదీ పార్టీ ఆఫీసులో ఓ పోస్టర్ వెలిసింది. ఇది రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. “యూపీ + బిహార్ = గయీ మోడీ సర్కార్ (ఉత్తరప్రదేశ్, బిహార్ చేతులు కలిపితే మోడీ ప్రభుత్వం గద్దె దిగుతుంది” అని ఆ బ్యానర్‌పై రాసి ఉంది. ఈ పోస్టర్‌లో నితీశ్​కుమార్, అఖిలేష్ యాదవ్ ప్రజా సమూహం ముందు  చూతులు ఊపుతూ దిగిన ఫొటోలు ఉన్నాయి.

నలుపు, తెలుపు బ్యానర్‌లో కేవలం రెండు రంగుల అంశాలు మాత్రమే ఉన్నాయి. – నితీష్ కుమార్ యొక్క ఆకుపచ్చ కండువా (అంగోచా), అఖిలేష్ యాదవ్ ఎరుపు టోపీ..ఈ  రెండూ తమ పార్టీలు ఇష్టపడే రంగుల ఎంపికను సూచిస్తున్నాయి. ఇక.. ఉత్తరప్రదేశ్, బిహార్​ నుంచి 120 (వరుసగా 80 మరియు 40) ఎంపీలు లోక్‌సభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో మెరుగైన పనితీరు కనబరిచే పార్టీ లేదా రాజకీయ నిర్మాణం జరిగితే కనుక ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మంచి స్థితిలో ఉన్నట్టు ఇక్కడి లీడర్లు చర్చ జరుపుతున్నారు.

దేశ రాజకీయాల గమనాన్ని మార్చే సంఘటనలను ప్రారంభించిన చరిత్ర ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు ఉన్నాయని బ్యానర్ రూపొందించిన వ్యక్తి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఐపీ సింగ్ శనివారం తెలిపారు.“ఈ రాష్ట్రాలు (మార్పు కోసం) నిర్ణయించుకుంటే (ఇతరులకు) ఏమీ మిగలదు. రాజకీయ మ్యాప్ చూస్తే బీజేపీ ఎక్కడా ఉండదు’’ అని మీడియాకు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement