Friday, November 22, 2024

‘పిల్ల‌ల‌’పై ఉపాస‌న కామెంట్స్..ఏమ‌న్నారో తెలుసా..

పెళ్ళి కానంత వ‌రకు పెళ్లి కాలేద‌ని..తీరా పెళ్లి అయ్యాక పిల్ల‌లు పుట్ట‌లేద‌ని ఇలా జ‌నాల‌కి ఏదో ఒక టాపిక్ కావాల్సిందే. ఇప్పుడిదే ప్ర‌శ్న‌ని ఎదుర్కొంటున్నారు రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు. దాంతో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న పిల్లల విషయం తన వ్యక్తిగతమని తెలిపారు. దీనిపై చాలామంది అడుగుతున్న ఇప్పటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని తేల్చిచెప్పింది. ఇప్పుడు దానికి సమాధానం చెప్పి దాన్ని సెన్సేషన్ చేయడం ఇష్టం లేదంది. దీనికి సరైన సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని వెల్లడించింది. కాగా రామ్ చరణ్, ఉపాసనకు 2012లో వివాహం జరిగింది.వీరిద్దరికీ పెళ్లి అయ్యి దాదాపు 8 ఏళ్ళు దాటింది.ది బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో .. రామ్ చరణ్- ఉపాసన జంట మొదటి వరుసలో ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement