Monday, November 18, 2024

కనీస వసతులు లేవు: ఉపాధి కూలీలు ధర్నా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని పెద్దమ్మ కుంట వద్ద జరుగుతున్న ఉపాధి పనుల వద్ద ప్రధాన రహదారిపై బుధవారం ఉపాధి కూలీలు ధర్నాకు దిగారు. గత కొద్ది రోజులుగా పనిచేస్తున్న రోజుకు కనీసం రూ.30 నుండి 70 రూపాయల లోపు మాత్రమే వస్తున్నాయని, సంబంధిత శాఖ అధికారులు ఫీల్డ్ మీదికి రావడం లేదని కూలీలు అంటున్నారు. కూలీలకు కనీస వసతులు,తాగునీరు, ప్రధమ చికిత్స కిట్లు పనిచేసే చోట  ఏర్పాటు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. కనీస సౌకర్యాలపై పట్టించుకునే నాథుడే కరువయ్యా అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఉపాధి కూలీలు పనులు నిలిపి వేసి ధర్నాకు దిగారు. ధర్నాకు వైస్ ఎంపీపీ విధిలేని అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక  రాజేందర్ మద్దతు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement