Friday, November 22, 2024

WPLT20 | ముంబైపై యూపీ వారియ‌ర్స్ విజ‌యం!

విమెన్స్ ఐపీఎల్‌లో ముంబై జ‌ట్టుపై యూపీ వారియ‌ర్స్ గెలిచింది. పోరాటం చేసిన మ‌హిళా క్రికెట‌ర్లు త‌మ ప్ర‌తాపాన్ని చూపారు. గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో ఆ జ‌ట్టు విజ‌యం సాధించింది. కాగా, ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ముంబై ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ (47 బంతుల్లో 55, 9 ఫోర్లు, 1 సిక్సర్‌) అర్థ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. యూపీ బౌలర్లు ఆరంభం నుంచే ముంబైని కట్టడిచేశారు. ఈ మ్యాచ్‌లో ముంబై రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ భుజం గాయం కారణంగా తప్పుకోవడంతో నటాలీ సీవర్‌ సారథిగా వ్యవహరిస్తోంది. పేసర్‌ షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ స్థానంలో ఇస్సీ వాంగ్‌ ఆడుతోంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ముంబైకి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు యస్తికా భాటియా (22 బంతుల్లో 26, 3 ఫోర్లు, 1 సిక్సర్‌), హేలీ మాథ్యూస్ నిలకడగా ఆడారు. అంజలి సర్వని వేసిన ఐదో ఓవర్లో యస్తికా.. మూడు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదింది. దీంతో అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన మాథ్యూస్‌ కూడా బ్యాట్‌కు పనిచెప్పింది. రాజేశ్వరి గైక్వాడ్‌ వేసిన ఏడో ఓవర్లో మాథ్యూస్‌.. 4, 6తో రెచ్చిపోయింది.

8 ఓవర్లలో 50 పరుగులు జోడించిన ఈ జోడీని గ్రేస్‌ హరీస్‌ ఔట్‌ చేసింది. ఆ తర్వాత వన్‌ డౌన్‌లో వచ్చిన స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ నటాలీ సీవర్‌ బ్రంట్‌ (14 బంతుల్లో 19, 2 ఫోర్లు) మాథ్యూస్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయింది. దీప్తి శర్మ వేసిన పదో ఓవర్లో మాథ్యూస్‌ మూడు బౌండరీలు బాది ముంబై స్కోరు వేగాన్ని పెంచింది. ఆమెనే వేసిన 14వ ఓవర్లో ఐదో బంతికి రెండు పరుగులు తీసి అర్థ సెంచరీ పూర్తిచేసుకుంది. 14 ఓవర్లలో ముంబై స్కోరు వంద పరుగులు దాటింది. కానీ గైక్వాడ్‌ వేసిన 15వ ఓవర్లో భారీ షాట్‌ ఆడబోయిన మాథ్యూస్‌.. లాంగాన్‌ వద్ద హరీస్‌ చేతికి చిక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement