ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడానికి నిన్నటితో గడువు ముగిసింది. అయితే రాష్ట్ర క్రీడల మంత్రి ఉపేంద్ర తివారీ నిన్న సాయంత్రం బల్లియా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం వైపు యమ స్పీడ్ గా పరుగెత్తుతూ కనిపించారు.
తివారీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థిగా ఫెఫ్నా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. కాగా, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తివారీ నామినేషన్ పేపర్లు పట్టుకుని ఉరుకుతున్న ఫొటో విపరీతంగా షేర్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.