రాజకీయ పార్టీలు తమ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలవు…. తమ ప్రచారం కోసం చివరకు ఎంత పెద్ద ప్రయత్నమైనా.. చిన్న ప్రయత్నమైనా వాటిని వినియోగించుకుంటారు. అయితే ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల సందడి మాస్కుల వరకు చేరింది. ఇప్పుడు మాస్కులు కూడా పార్టీల గుర్తులతో వచ్చేశాయి. యూపీలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తులతో మాస్కులను రూపొందించారు. వాటిని కొనుగోలు చేయడానికి ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. వాటిని ధరించి.. తమ పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆయా పార్టీల గుర్తులతో రూపొందించిన మాస్కులు మార్కెట్లలో సందడి చేస్తున్నాయి.
పార్టీల గుర్తులున్న మాస్కులపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. తమ అభిమాన పార్టీ గుర్తున్న మాస్కులను కొనుగోలు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. యూపీలోని వ్యాపారులు ట్రెండ్‌ను అనుకూలంగా మలుచుకుంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభించడంతో మాస్కులకు గిరాకీ ఏర్పడింది. ఆ మాస్కులు వివిధ రంగుల్లో, కంపెనీల గుర్తులతో ఇప్పటి వరకు వచ్చాయి. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మాస్కులు పార్టీల రంగులను సంతరించుకున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం.. పలువురు ప్రచారానికి వెళ్తుండడం గమనించిన వ్యాపారులు పార్టీల రంగులు, గుర్తులతో మాస్కులను తయారు చేస్తున్నారు. ఈ మాస్కులకు మంచి గిరాకీ ఉండడంతో వ్యాపారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..